కడియం కు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి

by Nallavelli.Anjaneyulu |

కడియం శ్రీహరి కి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని మాజీమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.

కడియం కు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కడియం శ్రీహరి కి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని మాజీమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి పై డాక్టర్ రాజయ్య శుక్రవారం స్పందించారు. ఆయనది నాలుక..తాటి మట్ట.. సభ్య సమాజం సిగ్గుపడేట్లుగా ఆయన ప్రవర్తన ఉందన్నారు. ఏం మాట్లాడాలో తోచక పిచ్చి పట్టినట్లు కల్వకుంట్ల కుటుంబం మీద కామెంట్స్ చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో టిడిపి పార్టీ భూస్థాపితం అయితే జీవచ్ఛవంలో పడి ఉన్న నిన్ను దయతో కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నాడన్నారు. నీ జీవితంలో ఊహించని విధంగా ఎంపీ, ఎమ్మెల్సీ,ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పదవులు 10 సంవత్సరాలు అనుభవించాడన్నారు.


చివరగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గానే బయటికి వెళ్లిన కడియం శ్రీహరి ఇన్ని చేసిన కేసీఆర్ మీద మాట్లాడటానికి నోరెల వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు కాసులకు అమ్ముడుపోయి ఇప్పుడు మాట్లాడము ఏమిటని ప్రశ్నించారు. నీ నోటితోనే ఒకప్పుడు కెసిఆర్ ను జాతిపిత అన్నావు కదా అని ఆయన అన్నారు. కాలేశ్వరం వరప్రదాయని అని పలికినవ్ కదా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది నీవు కాదా ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచావు కదా గెలుస్తా అనే నమ్మకం ఉంటే రాజీనామా చేయి అని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటావు. ఘనపూర్ కు వస్తే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తాడన్నారు. కేసీఆర్ ని బయటికి రా అంటున్నావ్ కదా కేసీఆర్ ని చూసే దమ్ముందా.. ఆయనను చూస్తేనే నీ పాయింట్ తడిసిపోతుందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు రారాజువి నమ్మకద్రోహానికి పరాకాష్ట అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో లాభం పొంది తిన్నింటి వాసాలు లెక్కపెట్టుతున్నట్టుగా మాట్లాడుతున్నాదన్నారు. రాబోయే ఎన్నికలలో నీవు తేల్చుకుందాం అని డాక్టర్ రాజయ్య అన్నారు.

Next Story