తాగునీటిలో పురుగుల మందు ఘటన.. నలుగురు సస్పెండ్

by Naga Rani Yarlagadda |

పై అధికారిపై కక్షతో తాగునీటిలో పురుగుల మందు కలపడంతో ఆ నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.

తాగునీటిలో పురుగుల మందు ఘటన.. నలుగురు సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: పై అధికారిపై కక్షతో తాగునీటిలో పురుగుల మందు కలపడంతో ఆ నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. గురుకుల విద్యాలయ సిబ్బంది చేసిన ఈ పనిపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ అయ్యారు. పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బి. వెంకన్నపై కక్షసాధింపులో భాగంగా.. సైన్స్ టీచర్ రాజేందర్, మరో ఇద్దరు టీచర్లు, వంటమనిషి కలిసి తాగునీటిలో పురుగుల మందు కలపగా.. ఆ నీరు తాగే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విచారణలో వెల్లడైంది. దీంతో కలెక్టర్ రాహుల్ శర్మ ముగ్గురు టీచర్లు, వంటమనిషిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న విద్యార్థుల్ని ఆయన పరామర్శించారు.

Next Story