బచ్చన్నపేట కాంగ్రెస్ లో చీలికలు..?

by Bhanu |

జనగామ జిల్లా కాంగ్రెస్లో చీలికలు, గ్రూపు తగాదాలు అధి కార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.

బచ్చన్నపేట కాంగ్రెస్ లో చీలికలు..?
X

దిశ, జనగామ: జనగామ జిల్లా కాంగ్రెస్లో చీలికలు, గ్రూపు తగాదాలు అధి కార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా బచ్చన్నపేట అధ్యక్షులు వ్యవహారం జనగామ డీసీసి అధ్యక్షుడికి తలనొప్పిగా మారిందా అంటే అవునని అంటున్నారు వారి స్వంత కార్యకర్తలే.. ఈ తరుణంలో వారి ఒంటెత్తు పోకడ వల్ల కాంగ్రెస్ లో చీలికల వ్యవహారం కాంగ్రెస్ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్నారు. మండల కమిటీతోపాటు పార్టీ కార్యక్రమాలన్నింటిలో ఆయన అనుచరులు తప్ప మరొకరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో మొదటి నుంచి హస్తం పార్టీని అంటుపెట్టు కున్నవారు, కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారు .అసలు అధ్యక్ష పదవి నికసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దక్కలేదని మొదటి నుండి వాదన వినిపిస్తున్న..పార్టీ లైన్ దాటొద్దని వారు మౌనంగా ఉన్నారని తెలుస్తుంది. నూకల బాల్ రెడ్డి తీరుతో మండలంలో కాంగ్రె స్కు నష్టం వాటిల్లే ప్రమాదముందని, ఆయనను తప్పించి మరొకరికి పగ్గాలు ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పలు మార్లు ఫిర్యాదు చేశారనీ వారు కార్యకర్తలను బుజ్జగించారని కార్యకర్తలు గుసగుసలు పెట్టడం కొసమెరుపు.


వారి సమ్యమమే వారిని పార్టీని కొంప ముంచిందని అంటున్నారు. డీసీసీ కి తెలవకుండా సి ఏం అర్ చెక్కుల పంపిణీ చేయడం దానికి డబ్బులుచెల్లిస్తే నే ఇస్తా నానడం కొసమెరుపు..మండల అధ్యక్షుడు గా ఉంటూ ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ తో కలిసి చెక్కుల పంపిణీ చేయాలని చూసిన తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బగ్గు మన్నారు . ఈ ఆలోచన మరింత రచ్చకు దారితీసింది. మండల స్థాయిలో పలు విషయాల్లో అతిగా ప్రవర్తిస్తూ యం.పి బంధువునంటూ పలు కార్యక్రమాలు ఇష్టానుసారం చేయడం మండల కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్ లో బాధితుల దగ్గర పైసలు వసూలు చేసి పనులు చేయిస్తానని చెప్పడం బహిరంగంగా స్వంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఆయనను మండల అధ్యక్షుడిగా కొనసాగిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. మొత్తంగా జనగామ మండల అధ్యక్షుడు తీరుతో కాంగ్రెస్ చీలికల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

జనగామ జిల్లా కేంద్రంలో బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు వాళ్ల బంధువులకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కు విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. అప్లికేషన్ గురించి మెసేజ్ కూడా వారికి రావడం జరిగింది అని అన్నారు .అదే క్రమంలో నూకల బాల్ రెడ్డి గతంలో మీకు చెక్ ఇప్పిస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పారు. అదెక్రమంలో మళ్ళీ ఈరోజు కొందరు చెక్కు వచ్చింది మీకు కావాలంటే ఖర్చవుతుంది అని చెప్పి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రావాల్సిందిగా కోరారు అని బాధితులు జనగామ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు.

పార్టీ ప్రోటోకాల్ తప్పితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు: కాంగ్రెస్ పార్టీ జనగామ

జనగామ లో కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ రాజకీయాలకు తావు లేదు అంటూ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్,జనగామ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాంజ మల్లేష్ మాట్లాడుతూ ముఖ్య ఉద్దేశం ఏమనగా జనగామ నియోజకవర్గంలో కొందరు కావాలని ఎమ్మెల్యే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉంటూ జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారు అని నాయకులు అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి నష్టం చేసిన వ్యక్తీ , కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు కావాలని జనగామలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, అనారోగ్యం తో ఉన్న వారి వద్దకు వెళ్ళి డబ్బులు(కమిషన్ )తీసుకొని ఏదో ఒక మంత్రితో పైరవీ చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు సమయానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, తానే సొంతంగా చెక్కులు తెప్పించినట్టు వ్యవహరిస్తూ తనకు ఎలాంటి అధికారం లేకున్న జనగామలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా నాయకులకు సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రాంలు పెట్టి పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడు అని అన్నారు.

(నాగపురి కిరణ్) ని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసే వరకు ఊరుకోమని నాయకులు తెలిపారు.

Next Story