- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
48 గంటల్లో నేరస్థుల పట్టివేత.. ఔరా అనిపించిన జనగామ పోలీసులు
జనగామ జిల్లాలో ఇటీవల భయాందోళన కలిగించిన దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వెంకిర్యాల గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించి కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ, జనగామ: జనగామ జిల్లాలో ఇటీవల భయాందోళన కలిగించిన దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వెంకిర్యాల గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించి కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిందితుల్లో ప్రధానంగా ఉన్న సామాను శివ అనే పాత నేరస్థుడి ఆధ్వర్యంలో మిగిలిన నలుగురు.. ప్యారాల సంపత్, ఒగ్గు మహేష్, మాదాసు శివ కాలనీ, కోమటి రాజా శేఖర్.. 19వ తేదీ రాత్రి మద్యం సేవించి వెంకిర్యాల తూకుంబాయ్ ప్రాంతంలో ఓ ఇంటిపై కన్నేశారు. తాళం వేసి ఉన్న ఇంటిని పగులగొట్టి, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారు.
ఈ దొంగతనంపై జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ పండరి చేతన్ నితిన్, ఇన్స్పెక్టర్ పి. దామోధర్ రెడ్డి పర్యవేక్షణలో విచారణ వేగవంతం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో సీఐ దామోధర్ రెడ్డి, ఎస్‌ఐ సి హెచ్. చెన్నకేశవులు తమ సిబ్బందితో యశ్వంతపూర్‌లో పెట్రోలింగ్ చేస్తుండగా, మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న నిందితులను పట్టుకున్నారు.
వారి విచారణలో ప్రధాన నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో, మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలు, రెండు బైకులు, రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ దామోధర్ రెడ్డి, ఎస్‌ఐ చెన్నకేశవులు, కానిస్టేబుళ్లు కే. జితేందర్, బి. కరుణాకర్, ఎన్. సాగర్, జి. మహేందర్ , ఎండీ. సల్మాన్ (ఏఏఓ)లను వరంగల్ సీపీ ప్రత్యేకంగా అభినందించారు. జనగామ పోలీస్ వ్యవస్థ తక్షణ స్పందనతో నేరాన్ని అణచివేసిన తీరు ప్రశంసనీయం. నేరానికి తావివ్వకుండా, ప్రతి దొంగతనాన్ని విచక్షణతో విచారించి నిందితులను పట్టుకుంటామన్న స్పష్టమైన సంకేతాన్ని ఈ ఘటన అందిస్తోంది.






