- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరుగైన సదుపాయాలు కల్పించే బాధ్యత మాది
విద్యార్థులకు పాఠశాలల్లో మెరుగైన వసతులు సదుపాయాలు కల్పించే బాధ్యత మాదని, మంచి ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ, లింగాల ఘణపురం : విద్యార్థులకు పాఠశాలల్లో మెరుగైన వసతులు సదుపాయాలు కల్పించే బాధ్యత మాదని, మంచి ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో అసంపూర్తిగా ఉన్న బాలికల వసతి గృహం పనులు పూర్తి చేయడానికి 1 కోటి 44 లక్షల రూపాయల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో రూ. 42 లక్షల 50 వేల నిధులతో అదనపు మౌలిక వసతుల కల్పన కోసం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బాలికల వసతి గృహం అసంపూర్తిగానే ఉందన్నారు.
తాను వచ్చిన తర్వాతనే నిధులు మంజూరు చేయించానన్నారు. నియోజకవర్గంలోని 7 కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కోసం 18 కోట్ల98 లక్షలు మంజూరు చేయించారన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మండలంలోని కోనాయచలం వద్ద పాఠశాల నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో విద్యారంగానికి పెద్దపీటవేశామన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం, అనేక మార్పులు తీసుకొస్తుంది అన్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులను కూడా కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అండాలు, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, ఈ ఈ అరుణ్ కుమార్, డి ఈ సురేందర్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ సర్పంచ్ లు ఎడ్ల లావణ్య రాజు 77, పోరెడ్డి సంతోష మల్లారెడ్డి, శైలజ ఉపేందర్ రెడ్డి, నర్సింగ రామకృష్ణ, బుచ్చయ్య, సంపత్, విష్ణు ప్రిన్సిపాల్ లు సునీత, అన్నపూర్ణ పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు దిలిప్ రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, నాయకులు బిట్ల బాబు, దూసరి గణపతి, బుషిగంపల ఆంజనేయులు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు






