వరంగల్ విద్యాశాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు

by Ratna Kumari |

వరంగల్ విద్యాశాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయం పరిధిలో జరిగే ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

వరంగల్ విద్యాశాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ విద్యాశాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయం పరిధిలో జరిగే ఫైళ్లను పరిశీలిస్తున్నారు. పాఠశాలల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, ఉద్యోగుల సర్వీసు ఫైళ్లతో పాటు పెండింగ్ ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అన్ని విషయాలపై అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వరంగల్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీ చిన్న మల్లయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. తమకు అందిన ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా విజిలెన్స్ అధికారులు ఉదయమే కార్యాలయానికి చేరుకున్నారు.


విద్యాశాఖ కార్యాలయంలో రోజువారి కార్యక్రమాలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఫైళ్లు, ఉద్యోగుల ఫైళ్లు, పెండింగ్ బిల్లులు, చెల్లింపులపై వివరాలు సేకరించారు. విద్యాశాఖ పరిధిలో జరిగే కార్యక్రమాలను పరిశీలించారు. ఆయా సర్వీసులకు అనుగుణంగా పైళ్లు క్లియర్ చేశారా, పెండింగ్ ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని డీఎస్పీ మల్లయ్య తెలిపారు. వివరాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.

Next Story