- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే సస్పెండే..!
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎంపిక, అనుమతి, నిర్మాణం, ఫోటో క్యాప్చర్ తదితర వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహా షబరీష్ హెచ్చరించారు.

దిశ, మరిపెడ : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎంపిక, అనుమతి, నిర్మాణం, ఫోటో క్యాప్చర్ తదితర వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహా షబరీష్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదకు న్యాయం చేయాలని అందిస్తున్న ఈ పథకాన్ని వారికి సక్రమంగా అందించాలన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ అధ్యక్షతన మండల కేంద్రంలోనీ ఆడిటోరియంలో మండల సభ గురువారం నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల సభలో పాల్గొన్న కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ సర్పంచులు తమ పరిధిలోని ప్రజలు తమ పరిధిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తొలుత మండలంలోని ఆయా శాఖాల అధికారులు రెండేళ్ల ప్రజాపాలన, రానున్న రోజుల్లో చేయబోయే ప్రగతి ప్రణాళిక గురించి చదివి వినింపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో గంజాయి వినియోగంలో ఉందని, ప్రధానంగా నిరుద్యోగ యువత ఎక్కువగా గంజాయి వాడకలంలో ఉన్నారని, ఈ విషయంలో సర్పంచులు, కౌన్సిలర్లు బాధ్యత తీసుకుని గంజాయి నివారణకు కృషి చేయాలని సూచించారు. గంజా బారిన వారిని కౌన్సిలింగ్ చేయాలని, ఇప్పటికే జిల్లా కేంద్రంలో డీ ఎడిక్షన్ సెంటర్ ప్రారంభించామన్నారు. గ్రామీణ, తండా స్థాయి నుంచి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అహర్నిషలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట ఆత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న 99 రోజుల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా (10) థీమ్ ల వారిగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రోడ్ సేఫ్టీ, హెల్మెట్ సీట్ బెల్ట్, రవాణా భద్రతపై ఈ వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ఒక అంశంపై జిల్లా ఎస్పీ శబరిష్, జిల్లా అధికారులు రవాణా శాఖ సిబ్బంది విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే మరిపెడ ప్రాంతంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలని సూచించారు.
ఇరిగేషన్, తాగునీరు, సానిటేషన్, హెల్త్,ఎడ్యుకేషన్ తదితర అంశాలలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వరి కాకుండా ఇతర వాణిజ్య పంటల వైపు రైతులను ముగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని, అధిక శాతం యూరియా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువుల వైపు రైతులు ముగ్గు చూపే విధంగా చూడాలని రైతులు కూడా బాధ్యత అధికంగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ ను తగ్గించాలన్నారు. నానో యూరియా ఇతర ప్రత్యామ్నాయ మందులను వాడాలని సేంద్రియ ఎరువులు మంచివని తెలిపారు. ఈ ప్రభుత్వం మహిళా సాధికారిత కోసం అహర్నిషలు కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఎన్నో సంక్షేమాలు చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి, వైస్ చైర్మన్ కాలం సునీత, మున్సిపల్ కమిషనర్ విజయనంద్, తహశీల్దార్ కృష్ణవేణి, అగ్రికల్చర్ ఏవో వీరాసింగ్, హౌసింగ్, మున్సిపల్ ఏఈలు ఉషా కీర్తి, శృతి, మండల వైద్యాధికారి డాక్టర్ రవి,ఎంఈఓ అనిత, సీడీపీఓ ఎల్లమ్మ, పాల్గొన్నారు.






