- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. మంత్రి సీతక్క
పేద ప్రజల కలల్ని నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

దిశ, ములుగు ప్రతినిధి : పేద ప్రజల కలల్ని నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఆమె అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. "ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆడబిడ్డలు, పేద కుటుంబాల భవిష్యత్తు కోసం ఈ పథకం ప్రారంభించాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం," అని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నమ్మకాన్ని ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపీడీఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






