- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్: బుచ్చంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సస్పెండ్..
‘దిశ’లో ప్రచురితమైన “ఇందిరమ్మ ఇంటికి నాదగ్గరే డబ్బులు అడిగారు” అనే శీర్షికతో వెలువడిన వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి చురుకుగా స్పందించారు.

దిశ, మంగపేట : ‘దిశ’లో ఈరోజు ప్రచురితమైన “ఇందిరమ్మ ఇంటికి నాదగ్గరే డబ్బులు అడిగారు” అనే శీర్షికతో వెలువడిన వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి చురుకుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, బుచ్చంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటూరి నాగయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు.
ఈ వివాదాస్పద వ్యవహారంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం, అలాగే దిశ డిజిటల్ మీడియాలో కథనం వెలువడిన తర్వాత పార్టీ దీనిని సీరియస్ తీసుకుంది. పార్టీ అంతర్గత విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, మంత్రి సీతక్క ఆదేశాల ప్రకారం, నాగయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ సందర్భంగా జయరాం రెడ్డి హెచ్చరికల వర్షం కురిపించారు.. “ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడితే ఎవరైనా సరే, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పవు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయటానికి మేము అవకాశం ఇవ్వం” అని చెప్పారు. ఈ సంఘటన తర్వాత మండల రాజకీయాల్లో కదలికలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాలను వ్యక్తిగత లాభాల కోసం వాడుకునే వారి గురించి పార్టీ అలర్ట్ మోడ్‌లోకి వెళ్లినట్టు సంకేతాలు వచ్చాయి.






