- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నాయిగూడెంలో.. మట్టి మాఫియా దందా
మట్టిమాఫియా రెచ్చిపోతోంది. ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండలంలో కొందరు మట్టి దందా వీరులు గోరంత అనుమతులు పొంది మట్టిని కాజేస్తూ ఏదేచ్ఛగా తరలిస్తున్నారు సొమ్ము చేసుకుంటున్నారు.

దిశ, కన్నాయిగూడెం: మట్టిమాఫియా రెచ్చిపోతోంది. ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండలంలో కొందరు మట్టి దందా వీరులు గోరంత అనుమతులు పొంది మట్టిని కాజేస్తూ ఏదేచ్ఛగా తరలిస్తున్నారు సొమ్ము చేసుకుంటున్నారు. రెవిన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో కొందరు అక్రమార్కులు యథేచ్చగా దందా పాల్పడుతున్నట్టు ఆరోపణలు మండల వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి.కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో అక్రమార్కుల బరితెగించి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.మండలంలోని లక్ష్మిపురం,కన్నాయిగూడెం, బుట్టాయిగూడెం,చింతగూడెం , ఏటూరు గ్రామాలలో మట్టిమా ఫియాకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. అధికారుల దృష్టికి సమాచారం వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోతోంది.దీంతో ప్రభు త్వ ఆదాయానికి అధికారులే గండి కొడుతున్నారని ఆరోపణలున్నాయి.
పల్లె గ్రామాల్లో మట్టి దందా అధికం..
మండలాలలో నిత్యం మట్టి అక్రమ దందా వీరులు అడ్డదారిలో సంపాదించుటకు అలవాటు పడి హైదరాబాద్ లాంటి మహా నగరాల నుంచి భారీ జెసిబిలు లీజ్ కు తీసుకువచ్చి వాటి సహాయంతో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.మండలంలో నూతన గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాల పనులకు యదేచ్చగా అక్రమ మట్టిని తరలిస్తూ రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి ఒక్కో ట్రాక్టర్ కు 700 నుండి 800 వరకు తీసుకొని లక్షలు గడిస్తున్నారు.మండలంలో ప్రధాన రహదారి పైన అక్రమ నిర్మాణాలకు మట్టిని తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసు కుంటున్నారు.తాసిల్దార్ కార్యాలయం ఎదుట అక్రమ నిర్మా ణాలకు మట్టి అక్రమంగా తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులతో మట్టి అక్రమ ణదారులు చేతులు కలిపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వాదాయానికి గండి
మట్టి మాఫియా చేసే అక్రమార్కులకు మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది.ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి మట్టిని తరలించాలన్న లేదా ప్రైవేట్ భూమిని చదును చేసుకోవాలన్న సంబంధిత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారి ప్రదేశానికి వెల్లి మట్టి తీసే ప్రాంతాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరపాలంటే మైనింగ్ రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి అందుకు కొంత నగదును ప్రభుత్వానికి సేల్ రూపే నా చెల్లించాలి.అయితే ఇలాంటిదేమీ పాటింకోకుండానే మట్టిని దర్జాగా తరలిస్తూ ప్రభుత్వ ఆదా యానికి గండి కొడుతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల అండ
మండల పోలీస్, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించినప్పటికీ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలకు తావిస్తుంది.మట్టి ఆక్రమణదారులను వదిలిపె ట్టడం వెనుక అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మట్టి మాఫియా వెనుక రాజకీ య నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సైతం వినిపి స్తున్నాయి.
అధికారుల అండతో ఇష్టారాజ్యం
మట్టి దండ వీరులకు ఎలాంటి అనుమతులు లేకుండానే గుత్తేదారులు ఇష్టారాజ్యంగా అక్రమంగా వాటిని తరలిస్తూ అభివృద్ధి పనుల పేరిట అక్రమ సంపాదనే మార్గాలను ఎంచుకుంటున్నారు. కన్నాయిగూడెం మండలం లో కొందరు ప్రభుత్వ భూములు,పంట చేళ్లలో రైతులను మంచిగా చేసుకొని ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన రహదారులు, కల్వర్టులకు ప్రభుత్వ రంగ కార్యాలయాలకు అక్రమ మార్గంలో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జెసిబిల సహాయంతో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాజకీయ నాయకులు ఇచ్చే మామూళ్లకు పాల్పడుతూ మట్టి మాఫియాకు అధికారులు ఎదురు వెళ్లడం లేదని పలువురు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో ని పలు గ్రామాల్లో అర్ధ రాత్రి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణాలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమ మట్టి దందా నడుస్తున్న, అధికారులకు సమాచారం అందించినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొంతమంది వ్యక్తులు అధికారు లను మచ్చిక చేసుకుని మట్టి దందాకు తెరలేపినట్లు విశ్వ సనీయ సమాచారం ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధి కారులు అవినీతి అక్రమాలకు కోమ్ము కాస్తున్నారని పలు వురు నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్య వేక్షణ లోపంతో మండలం లో మట్టి దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది.






