అక్ర‌మంగా మ‌ట్టి త‌ర‌లింపు

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని సూర్య‌తండా గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి అక్ర‌మంగా మ‌ట్టి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించిన వారిని పోలీసులు ప‌ట్టుకొని జేసీబీ, మూడు ట్రాక్ట‌ర్ల‌ను సీజ్ చేసి న‌లుగురి పై కేసు న‌మోదు చేశారు.

అక్ర‌మంగా మ‌ట్టి త‌ర‌లింపు
X

దిశ, గీసుకొండ : మండ‌ల ప‌రిధిలోని సూర్య‌తండా గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి అక్ర‌మంగా మ‌ట్టి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించిన వారిని పోలీసులు ప‌ట్టుకొని జేసీబీ, మూడు ట్రాక్ట‌ర్ల‌ను సీజ్ చేసి న‌లుగురి పై కేసు న‌మోదు చేశారు. సీఐ విశ్వేశ్వ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొమ్మాల జాత‌ర అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రోడ్డు నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్ ఎలాంటి ప్ర‌భుత్వ అనుమ‌తులు లేకుండా సూర్య‌తండా స‌మీపంలోని కాలువ‌లో జేసీబీ స‌హాయంతో మ‌ట్టి త‌వ్వించి ట్రాక్ట‌ర్ల ద్వారా త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జేసీబీతో పాటు మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. పోలీస్ శాఖ అనుమతులతో మట్టి రవాణా జరుగుతున్నట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని సీఐ స్పష్టం చేశారు. ఈ ఘటనలో బుక్క వేణు, నాయన బోయిన రాజు, తుత్తురు రవి, బూర్గుల కొమురయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Next Story