- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేం ఇసుక దందా..ఇంతా అక్రమమా.. లోడింగ్ కావాలంటే 1600 లు కట్టాల్సిందే..
ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఇసుక రీచ్లలో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది.గుత్తె దారులు అడిందే అటగా పాడిందే పాటగా ఇసుక రీచ్లలో అక్రమాలకు తెరలెపిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో కొరత చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఇసుక రీచ్లలో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది.గుత్తె దారులు అడిందే అటగా పాడిందే పాటగా ఇసుక రీచ్లలో అక్రమాలకు తెరలెపిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో కొరత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రీచ్‌లలో కళ్లకు కట్టినట్లు అనుమతులు ఒక చోట తవ్వకాలు మరో చోట అన్న రీతిన తవ్వకాలు జరుగుతున్న తనికీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలసిన అధికారులు మాత్రం కళ్లు మూసుకున్నాం కానివ్వండి.. అన్న రీతిన వ్వవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోడింగ్ చార్జ్ ఇస్తేనే ఇసుక లోడ్ చేస్తాం అనే గుత్తెదారుల మొండి వైఖరితో ఇసుక లోడింగ్ కోసం వెల్లిన ఇసుక లారీ డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు.గుత్తెదారుల నిరాంకుశ వైఖరితో అలసిపోయిన ఇసుక లారీ డ్రైవర్లు సంబంధిత అధికారులను అశ్రాయించిన వారికి న్యాయం జరగడం లేదు..ఏదురు తిరిగిన లారీ డ్రైవర్లకు శిక్షగా గంటల తరబడి క్వారీలలో లోడింగ్ కోసం నిరీక్షించిడం ఏదురవుతుందని లారీ డ్రైవర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతలా ఇసుక రీచ్లలో అక్రమాలు కొనసాగుతున్నఅధికారులు అ వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల కొకోల్లాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక రీచ్‌లలో వీధులు నిర్వహిస్తూ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు, ఇసుక తోలకాలు, ఇసుక లొడింగ్ లు జరిగేలా చూడాల్సిన టీజీఏండీసీ సిబ్బంది ఉండగానే ఇసుక రీచ్లలో అక్రమాలు అనేకం కోనసాగుతుండడం గమనార్హం.
రీచ్‌లలో అక్రమ వసూళ్లు..
ఇసుక రీచ్‌లు అక్రమ వసూళ్లకు అడ్డగా మారయాన్న ఆరోపణలు ఏజెన్సీలో వెల్లువెత్తుతున్నాయి. ఇసుక లోడింగ్ కోసం వచ్చే లారీలు(లారీ డ్రైవర్లు) ఇసుకాసురులకు అక్రమ మూల్యం చెల్లించక తప్పడం లేదు. అక్రమ వసూళ్ల కోసం ఇసుకాసులు రీచ్‌లలో నయా ట్రెండ్ ఫాలో అవుతూ వివిద రకాలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక లోడింగ్ కోసం లారీలు ర్యాంపుల్లో ప్రవేశించిన మొదటి దశ నుండే అక్రమ వసూళ్ల పర్వం మొదలవుతున్నట్లు తెలుస్తుంది. లారీ సీరియల్ కోసం 100రూ, ఇసుక లోడింగ్ చేయాలంటే 1600రూ, జేసీబీకీ 500రూ, ఇసుక లోడ్ చేసిన తర్వాత ఏక్కువ తక్కువ, ఇసుక వస్తే సరి చేయడానికి జేసీబీకి 200రూ..అక్రమంగా వసూలు చేస్తున్నట్లుగా లారీ డ్రైవర్ల నుండి తెలిసిన సమాచారం.
ప్రశ్నిస్తే బళ్లు పక్కకే..
ఇసుక రీచ్‌లలో అక్రమ వసూళ్ల పర్వం కోనసాగుతున్న నేపద్యంలో ఇదేమిటి అనీ ప్రశ్నించిన, ఏదురు తిరిగిన లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటున్నట్లు లారీ డ్రైవర్ల నుండి బహిరంగంగా తెలుస్తున్న సమాచారం. లోడింగ్ చార్జ్ ఇవ్వకుంటే రీచ్‌లలో గంటల తరబడి లారీలను నిలిపివేసి లోడింగ్ చేయకుండా ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల వాజేడు మండలంలోని ఒక పట్టా ల్యాండ్ ఇసుక రీచ్‌లో లోడింగ్ చార్జ్ ఇవ్వకపోవడంతో ఇసుక లోడ్ చేయడం కుదరదని లారీ డ్రైవర్‌కు క్వారీ వారు చేప్పడంతో ఈ విషయాన్ని అ లారీ డ్రైవర్ చరవాణీ ద్వారా జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సుమారు అ లారీ డ్రైవర్‌ను లారీ పక్కకు పెట్టించి ఇసుక లోడింగ్ చేయకుండా 7 గంటల పాటు రీచ్ లోనే నిరీక్షింప చేసినట్లు లారీ డ్రైవర్ ద్వారా తెలిసిన సమాచారం.అయితే జరుగుతున్న అక్రమ వసూళ్లని రీచ్‌లలో టీజీఏండీసీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిర్యాదుల నెంబరు ద్వారా పిర్యాదు చేద్దాం అని ప్రయత్నిస్తే అ నెంబరు పనిచేయడం లేదని లారీ డ్రైవర్ తెలిపాడు.
కనుసన్నల్లోనే అక్రమాలు..?
ఇసుక రీచ్‌లలో యదేచ్చగా కోనసాగుతున్న అక్రమాల పర్వం సదరు సంబంధిత శాఖల అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఏజెన్సీలో వాదనలు నెలకొంటున్నాయి. ఇసుక రీచ్‌లలో బహిరంగంగా కొనసాగుతున్న అక్రమాలపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం, కనీసం అ వైపు దృష్టి సారించకపోవడంతో సంబంధిత అధికారుల ప్రోద్బలం, అండదండలు గట్టిగానే ఉన్నట్లుగా ఏజెన్సీ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి ఇసుక రీచ్‌లలో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమాలపై, అక్రమ వసూళ్లపై దృష్టి సారించి శాఖపరమైన గట్టీ చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి..






