పులి కాదు.. హైనా.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు

by Bhanu |

మండలంలోని కొయ్యూరు-ఎడ్లపల్లి పరిసర ప్రాంతాల్లోని పోడు భూమి పత్తి చేన్లలో సోమవారం ఉదయం రైతులు పాదముద్రలు గుర్తించి..

పులి కాదు.. హైనా.. ఊపిరిపీల్చుకున్న ప్రజలు
X

దిశ, మల్హర్: మండలంలోని కొయ్యూరు-ఎడ్లపల్లి పరిసర ప్రాంతాల్లోని పోడు భూమి పత్తి చేన్లలో సోమవారం ఉదయం రైతులు పాదముద్రలు గుర్తించి పెద్దపులిగా అనుమానం వ్యక్తం చేశారు. పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అది పెద్దపులి కాదు హైన అనే ఓ జంతువు పాదముద్రలని స్పష్టం చేశారు.

పెద్దపులి సంచరించిన విషయం వాస్తవమే కానీ అది ఇప్పుడు ఈ అడవిలో ఉన్నట్లు ఆనవాలు ఎక్కడ కనిపించడం లేదు. హైనా అనే జంతువు సంచరించడం పెద్దపులి పాదాలకు దగ్గర పోలికలతో ఆ జంతు పాదముద్రలు ఉండడం ఆసక్తికరమైన విషయం. రైతులెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అది హాని కలిగించే జంతువు కాదు అయినా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

Next Story