- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Bandi Sanjayకు రిమాండా..? బెయిలా.. కాసేపట్లో ఆదేశాలివ్వనున్న మహిళా మెజిస్ట్రేట్
Bandi Sanjayకు రిమాండా..? బెయిలా.. కాసేపట్లో ఆదేశాలివ్వనున్న మహిళా మెజిస్ట్రేట్

X
దిశ, వెబ్ డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అరెస్టైన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు హాజరుపర్చారు. కోర్టు ఎదుట బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో బండి సంజయ్‌ను వెనుక గేటు నుంచి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరోవైపు బండి సంజయ్‌కు బెయిల్ కోరుతూ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఆదేశాలపై బీజేపీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. బండిసంజయ్‌కు రిమాండ్ విధిస్తారా..?. లేదా బెయిల్ మంజూరు చేయనున్నారా? అనే సందిగ్ధం కూడా వారిలో ఉంది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోర్టు వద్దకు చేరుకున్నారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story






