- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
by Bhanu |
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని కొమ్ములవంచలో ఆదివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా

X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని కొమ్ములవంచలో ఆదివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేరాల సోమయ్య వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదగా మారాయి. వాటి అంచనిత విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






