నిజాయితీ చాటుకున్న స్కూల్ బస్ డ్రైవర్.!

by Elthuri vijay kumar |

రోడ్డుపై దొరికిన నగదు బ్యాగును బాధితుడికి అందజేత

నిజాయితీ చాటుకున్న స్కూల్ బస్ డ్రైవర్.!
X

నిజాయితీ చాటుకున్న స్కూల్ బస్ డ్రైవర్.!

- రోడ్డుపై దొరికిన బ్యాగు

- బ్యాగులో రూ.52వేల నగదు.. బాధితుడికి అందజేత

దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న ఆంజనేయులు విధి నిర్వహణలో భాగంగా వేమునూరు గ్రామంలో పిల్లలను దింపి వస్తున్న క్రమంలో రోడ్ పై ఒక బ్యాగ్ దొరకింది. అది తెరచి చూస్తే రూ.52వేల నగదు ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే పాఠశాల కరెస్పాడెంట్ కి విషయం తెలియజేయగా ఆయన ఆరా తీయడంతో వేమునూరు గ్రామ శివారు రాములు తండాకి చెందిన గుగులోత్ ప్రవీణ్ వి అని నిర్ధారించుకొని అతడికి నగదు అప్పజెప్పారు. దీంతో బాధితుడు పాఠశాల యాజమాన్యానికి, నిజాయితీగా బ్యాగును తిరిగి అప్పగించిన స్కూల్ బస్సు డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపాడు. కష్టపడి పని చేసిన సొమ్మే శాశ్వతమని, ఇతరుల సొమ్ముపై తనకెప్పుడు ఆశలేదనీ ఆంజనేయులు తెలిపారు.

Next Story