- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు...పలు గ్రామాలకు రాకపోకలు బంద్
by velandi.Saikiran |
భారీ వర్షానికి మండలంలోని దొడ్ల మల్యాల మధ్య గల మట్టి రోడ్డు.. తూములతో సహా కొట్టుకొని పోయింది.

X
దిశ, ఏటూరు నాగారం: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని దొడ్ల మల్యాల మధ్య గల మట్టి రోడ్డు.. తూములతో సహా కొట్టుకొని పోయింది. దీంతో మండల కేంద్రంతో పలు గ్రామాలకు సంబంధం తెగిపోయింది. రూ.60 లక్షలతో చేపట్టిన పనులు ఒక్క వర్షానికే గంగ పాలు అయ్యింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వర్షకాలం ప్రారంభంకాకముందే కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. దీనిపై మంత్రి సీతక్క సమాధానం చెప్పాలని సీరియస్ అయ్యారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క, ప్రభుత్వం స్పందించి, ఆ గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు .
Next Story






