తాను త‌ప్పుడు మార్గంలో ఎప్పుడు న‌డ‌వ‌ను : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by Ratna Kumari |

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నీతి, నిజాయితీతో పని చేస్తానే తప్ప, తప్పుడు మార్గం త‌న‌ రాజకీయ చరిత్రలోనే లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

తాను త‌ప్పుడు మార్గంలో ఎప్పుడు న‌డ‌వ‌ను :  ఎమ్మెల్యే కడియం శ్రీహరి
X

దిశ, లింగాల ఘణపురం : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నీతి, నిజాయితీతో పని చేస్తానే తప్ప, తప్పుడు మార్గం త‌న‌ రాజకీయ చరిత్రలోనే లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని నవాబుపేట గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇల్లు 15 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు ముదిరాజ్ కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జనుల పోరాటంతో ఎంతోమంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందన్నారు. కోట్లాది రూపాయల తెలంగాణ ప్రజల దనాన్ని దోచుకున్న నాయకులు ఈరోజు నీతులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉండి తలవంపులు తీసుకొచ్చినవాడు అవినీతి, అక్రమాలకు, బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడు అని పేర్కొన్నారు.

దేవాదుల నీటి ద్వారా మండల ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రజాసంక్షేమం కోసమేనని, తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తూ వస్తున్నారన్నారు. నవాబుపేట గ్రామానికి మరో 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని,2కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సదానందం, బుచ్చయ్య, నర్సింగ రామకృష్ణ, జీడికల్ చైర్మన్ మూర్తి, మాజీ జ‌డ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, యువజన నాయకుడు ప్రవీణ్, మార్కెట్ డైరెక్టర్ మోహన్,దూసరి గణపతి, నాగేందర్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్,కృష్ణారెడ్డి, అశోక్, రాజు, గంగాధర్, చింతల వెంకన్న, అబ్బాస్, ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Next Story