- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొర్రూర్‌లో ప్రజా తీర్పు బీఆర్‌ఎస్‌కే
తొర్రూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది కౌన్సిలర్లకు హరీష్ రావు ఘనంగా సన్మానం చేశారు.

తొర్రూర్‌లో ప్రజా తీర్పు బీఆర్‌ఎస్‌కే – చైర్మన్ ఎన్నికపై కోర్టులో పోరాటం...
-కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్… మళ్లీ బీఆర్‌ఎస్ చైర్మన్ తీసుకొస్తాం...
దిశ తొర్రూరు :- తొర్రూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది కౌన్సిలర్లకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చిందని, ప్రజలు తమ పార్టీకి పట్టం గట్టారని హరీష్ రావు పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు హక్కును ఉపయోగించిన రోజే చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, మరుసటి రోజుకు వాయిదా వేయడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని విమర్శించారు. ఈ అంశంపై కోర్టులో పోరాడి మళ్లీ బీఆర్‌ఎస్ చైర్మన్‌ను తీసుకువస్తామని స్పష్టం చేశారు.
తొర్రూర్‌లో చైర్మన్ ఎన్నికల సందర్భంగా 1400 మంది పోలీసులను మోహరించడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. రైతులకు రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పాలన చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ క్యాబినెట్‌లో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం మేడారం టెండర్ విషయంలో బయటపడిందని, దేవాదాయ శాఖ మంత్రికి చెందిన టెండర్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకోవడం అందరికీ తెలిసిందేనని అన్నారు. మేడారం అభివృద్ధి పనులపై ప్రజలు అసంతృప్తితో మంత్రి కాన్వాయ్ అద్దాలను పగలగొట్టిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాలన, అభివృద్ధి విధానాలను చూసి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులను హెచ్చరిస్తూ, బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అధికారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు బాల్క సుమన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించిన హరీష్ రావు, పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, తమకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్‌ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గెలిచిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






