దుగ్గొండిలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

by Batti.Sumithra |

వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో పట్టణంలో నగర సంకీర్తన శనివారం ఘనంగా నిర్వహించారు.

దుగ్గొండిలో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన
X

దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో పట్టణంలో నగర సంకీర్తన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నగర సంకీర్తన హనుమాన్ దేవాలయం నుండి మొదలుకొని గ్రామవీధులలో తిరిగి శ్రీ భక్తాంజనేయ దేవాలయం వరకు కొనసాగింది. నగర సంకీర్తనకు స్త్రీలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తి భావ గీతాలతో జై శ్రీరామ్ అనే నినాదాలతో వీధులు మారుమోగాయి. అంతకు ముందు ఆలయంలో అభిషేకం నిర్వహించారు.

భజన మండలి సభ్యులు మాట్లాడుతూ నగర సంకీర్తనకు వివిధ రకాలుగా సహకరించిన దాతలకు ఆ భగవంతుని కృప కటాక్షాలు వారి కుటుంబానికి, వారికి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి పోలోజు లింగమూర్తి, భజన మండలి సభ్యులు పర్లపల్లి స్వరూప నర్సయ్య, నాగరాణి కుమారస్వామి, కరుణ తిరుపతి, దేవులపెళ్లి రాజమని సదానందం, పోలోజు సంధ్య బ్రహ్మచారి, కోతి గీత భిక్షపతి, కక్కేర్ల బాబు, యాదగిరి నాగరాజు, జక్కుల రాజమౌళి, పోలోజు సదానందం, వీరాచారి, సలేంద్ర రాములు భక్తులు పాల్గొన్నారు.

Next Story