బస్‌స్టాండ్ పరిధిలో టీ స్టాల్, లాడ్జ్ యజమానులకు పోలీసుల కౌన్సిలింగ్..

by Bhanu |

హనుమకొండ బస్‌స్టాండ్ పరిధిలో రాత్రివేళ జరిగే అనుచిత కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

బస్‌స్టాండ్ పరిధిలో టీ స్టాల్, లాడ్జ్ యజమానులకు పోలీసుల కౌన్సిలింగ్..
X

దిశ, హనుమకొండ : హనుమకొండ బస్‌స్టాండ్ పరిధిలో రాత్రివేళ జరిగే అనుచిత కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో బస్‌స్టాండ్ పరిధిలో పనిచేస్తున్న టీ స్టాల్స్, పాన్ షాపులు, లాడ్జ్‌ల యజమానులు, వర్కర్లకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, రాత్రి 10:30 తర్వాత షాపులు తెరిచి ఉంచరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనవసరంగా రాత్రివేళ రోడ్లపై తిరిగే వారిపై పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు.

లాడ్జ్ యజమానులు తగిన గుర్తింపు పత్రాలు (ఆధార్, ఫోన్ నంబర్) లేని వ్యక్తులకు గదులు ఇవ్వరాదని, ఆసాంఘిక కార్యకలాపాలకు లొంగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు.



Next Story