- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో హమాలీ కూలీ ఆత్మహత్య
అప్పుల బాధ తాలలేక హమాలి కూలి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, గీసుగొండ: అప్పుల బాధ తాలలేక హమాలి కూలీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి శ్రావణ్ (40) హమాలీ పని చేసుకుంటూ వరంగల్ కొత్తవాడలో తన కుటుంబంతో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు.
తను తన ఇంటి అవసరాల కోసం చేసిన అప్పులు తీరటం లేదని బాధపడుతూ ఉండేవాడని, గురువారం రోజున మునుగొండ గ్రామంలో కుల సంఘం చిట్టి ఉన్నదని చెప్పి కొత్త వాడ నుండి వచ్చి స్వగ్రామంలోని సొంత ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయాడని మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Next Story






