- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్ కార్డుల మార్గదర్శకాలను విడుదల చేయాలి
డీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు డి. మహేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యాలయం హనుమకొండ జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు.

దిశ, హన్మకొండ టౌన్ : డీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు డి. మహేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యాలయం హనుమకొండ జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు. హెల్త్ కార్డుల విడుదలకు ముందే మార్గదర్శకాలను విడుదల చేయాలని, ఈ కార్డుల ద్వారా అందే సేవలపై ఉద్యోగ ఉపాధ్యాయులతో పలు సందేహాలు నెలకొన్నాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తదుపరి మాత్రమే ముందుకు వెళ్లాలని హడావిడిగా అమలు చేసి ఉద్యోగుల నుంచి చందాను తీసుకోరాదు అన్నారు.
కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ హెల్త్ కార్డుల విడుదలకు ముందే మార్గదర్శకాలను విడుదల చేయాలని, ఈ కార్డుల ద్వారా అందేసేవలపై ఉద్యోగ ఉపాధ్యాయులలో అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తదుపరి మాత్రమే ముందుకు వెళ్లాలని హడావుడిగా అమలు చేసి ఉద్యోగుల నుండి చందాను తీసుకోరాదు అన్నారు. మెజారిటీ ఉపాధ్యాయులు జనగణనలో ఉన్నందున సర్వీస్ వివరాలను ఐఎఫ్ఎమ్ఎస్ లో పొందుపరచడానికి గడవును పొడిగించాలన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హెల్త్ కార్డులపై సేవలను పొందడం ఐశ్చికం చేయాలని కోరారు. ఈ కమిటీ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, సభ్యులు, సుధారాణి, కుమార స్వామి, సూరయ్య, ఆనందాచారి, నర్సింహులు, రామ్ రెడ్డి, శ్రీనివాస్, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.






