- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
by Ratna Kumari |
ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

X
దిశ, రఘునాథపల్లి : ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని అశ్వరావు పల్లి, వెల్ది గ్రామాల ఐకేపీ సెంటర్లను సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ జూన్ మొదటి వారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ మొండి వైఖరిని వీడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు కనీసం సగం వడ్లుకొనుగోలు చేయలేదని ఒకవైపు గన్ని బ్యాగుల కొరత, మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, వడ్లు ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో రైతులుగోసపడుతున్నారన్నారు.
రూ.90 లక్షల మెట్రిక్ టన్నులధాన్యంకొనుగోలుచేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరగడం లేదన్నారు. ప్రభుత్వ అసమర్థతకు ఇదే నిదర్శనం అన్నారు. జూన్ మొదటివారం నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతులను కలుపుకొని ధర్నాలు రాస్తారోకోలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్, ముసిపట్ల విజయ్, పెండ్లి మల్లా రెడ్డి,జిల్లా నాయకులు గూడ కిరణ్,కొర్ర రాజేందర్ నాయక్,ఎడ్ల బాలరాజు, నాయకులు గోనె మల్లారెడ్డి, పెండ్లి భూపాల్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్, కృష్ణ, భూక్య రాజు పాల్గొన్నారు.
Next Story






