నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వం

by Ratna Kumari |

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.

నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ప్ర‌భుత్వం
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రైవేట్ కంపెనీలో జిల్లాకు చెందిన 25 మంది యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు పొందగా కలెక్టర్ శనివారం ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా “ఉద్యోగ సాధన - ప్రతిభకు అవకాశాల అనుసంధానం” అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు. తగిన అర్హత, నైపుణ్యాలు కలిగిన స్థానిక యువతీ యువకులకు రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం ప్రైవేట్ లిమిటెడ్, బహుళజాతి కంపెనీల సహకారంతో త్వరలోనే జిల్లాలో మెగా జాబ్ మేళాను నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బి.రామ్ మోహన్, టాస్క్ మేనేజర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Next Story