పురుగుల మందు తాగి యువకుడు మృతి

by Bhanu |

తాగుడు కు బానిసై పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లో గురువారం చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగి యువకుడు మృతి
X

దిశ, గార్ల : తాగుడు కు బానిసై పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్ కె.రియాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని పాత పోచారం గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్ (26) అనే యువకుడు జె సి బి,ట్రాక్టరు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.గత ఆరు నెలలుగా తాగుడు కి బానిసై కిస్తీ లు కట్టకుండా జల్సా గా తిరుగుతూ ఉంటున్న క్రమంలో నరేష్ ను తల్లి ఎందుకు ఇలా చేస్తున్నావని మందలించడం తో నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేష్ తండ్రి రామయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




Next Story