చెత్త ట్రాక్టర్‌కి కార్యాలయం క్యాంప్‌గా మారింది..!

by Bhanu |

ఇరుసులాపురం పంచాయతీ పరిధిలో ప్రజలకు ఇబ్బందులే మిగిలాయి. పంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్ సుమారు పదిరోజులుగా కార్యాలయ ఆవరణలోనే చెత్తతో నిండి నిలిపివేయడంతో పరిసరాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపించింది.

చెత్త ట్రాక్టర్‌కి కార్యాలయం క్యాంప్‌గా మారింది..!
X

దిశ, బయ్యారం: ఇరుసులాపురం పంచాయతీ పరిధిలో ప్రజలకు ఇబ్బందులే మిగిలాయి. పంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్ సుమారు పదిరోజులుగా కార్యాలయ ఆవరణలోనే చెత్తతో నిండి నిలిపివేయడంతో పరిసరాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపించింది. సాధారణంగా ఈ ట్రాక్టర్‌ స్థానిక కాలనీల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ పాలనలో నిర్లక్ష్యం వలన కార్యాలయం ఎదురుగా ట్రాక్టర్‌ను చెత్తతో నింపి అలాగే వదిలేయడంతో ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నారు.

చెత్త దుర్వాసనతో స్థానిక కాలనీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ నివసించే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నామని వాపోతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్న ప్రాథమిక బాధ్యతను పంచాయతీ నిర్వాహకులు గాలికి వదిలేశారంటూ వారు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సమస్యపై స్పందన కోరుతూ పంచాయతీ సెక్రటరీ ప్రియకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆమె నుంచి ఎటువంటి స్పందలేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story