వరంగల్ లో గణేష్‌ శోభయాత్ర... 2100 మంది పోలీసులతో బందోబస్తు

by velandi.Saikiran |

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేటు పరిధిలోని సెంట్రల్‌, ఈస్ట్‌,వెస్ట్‌ జోన్ల పరిధిలోని అన్ని గణేష్‌ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భ

వరంగల్ లో గణేష్‌ శోభయాత్ర... 2100 మంది పోలీసులతో బందోబస్తు
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేటు పరిధిలోని సెంట్రల్‌, ఈస్ట్‌,వెస్ట్‌ జోన్ల పరిధిలోని అన్ని గణేష్‌ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. గణేష్‌ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మీడియాకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలు వెల్లడించారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని మూడు జోన్ల పరిధిలో నలుగురు డిసిపిలు, ఇద్దరు అదనపు డిసిపిలు, 15 మంది ఏసిపిలు, 53 మంది ఇన్స్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్‌.ఐలుతో పాటు ఏ.ఎస్‌.ఐ, హెడ్‌ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, హోంగార్డ్స్‌ తో కలుపుకొని మొత్తం 2100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు.

ఇందులో ప్రత్యేకించి ట్రై సిటి పరిదిలో మొత్తం 1600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. శోభయాత్రతో పాటు నిరమజ్జనోత్సవం సజావు కోనసాగేందుకు పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా కార్యక్రమ నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. గణేష్‌ శోభయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయణ కలగకుండా రేపటి నుండి ట్రాఫిక్‌ మళ్ళింపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లతో పాటు ముఖ్యమైన మార్గాల్లో ట్రాఫిక్‌ సిబ్బంది నియమించడం జరిగిందని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు.

నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని,నిర్వాహకులు నిమజ్జనం కోసం వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆడియో సిస్టమ్స్‌ నిర్ణీత స్థాయిలో వుయోగించాలని, డి.జేలు పూర్తిగా నిషేధమన్నారు. వాహనాలను ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా నడపాలని,వాహనాలను ప్రార్థన మందిరాల వద్ద నిలపరాదన్నారు. శోభయాత్ర వేళ బానాసంచా కాల్చడం నిషేధమన్నారు. శోభయాత్ర కోనసాగే మార్గంలో విద్యుత్తు తీగలను గమనిస్తూ యాత్ర కోనసాగాలన్నారు. నిమజ్జనం ప్రాంతానికి చిన్నపిల్లలను తీసుక వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలన్నారు., ఎటువంటి ‘‘ రూమర్స్‌ ‘‘ ( పుకార్ల) ను నమ్మరాదని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనవద్దన్నారు. అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్‌ 100 డయల్‌ డయల్‌ చేయాలన్నారు. పోలీసులు సూచించిన నిబంధనలు పాటిస్తూ శోభయాత్ర, నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు పిలుపు నిచ్చారు.

Next Story