ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి నలుగురు సభ్యులు రాజీనామా..!

by Ratna Kumari |

మండ‌ల కేంద్రంలోని ఇందిర‌మ్మ కమిటీకి నలుగురు సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు మండల అధికారికి లేక ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి నలుగురు సభ్యులు రాజీనామా..!
X

దిశ, ధర్మసాగర్ : మండ‌ల కేంద్రంలోని ఇందిర‌మ్మ కమిటీకి నలుగురు సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు మండల అధికారికి లేక ఇచ్చారు. "నిజమైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీకి సభ్యులుగా నియమించబడ్డాం. ధర్మసాగర్ గ్రామంలో కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లబ్ధిదారుల లిస్టు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ఒక్క‌ సమావేశం కూడా పంచాయతీ కార్యదర్శి లేదా మండల పరిషత్ అధికారి నిర్వహించలేదు" అని పేర్కొన్నారు.

"మా అభిప్రాయాలు సూచనలు తీసుకోవడం లేదని లబ్దిదారుల ఎంపిక ఎవరు చేస్తున్నారని విషయం కూడా మాకు తెలియడం లేదు. లబ్ధిదారుల లిస్టులోని కొందరు పేర్లు తొలగించడం, మరికొందరు పేర్లను చేర్చడం కూడా ఎవరు చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇది ప్రభుత్వ, స్థానిక ఎమ్మెల్యే పారదర్శకత లక్ష్యాలకు విరుద్ధంగా జరుగుతున్నందున ఇలాంటి పరిస్థితుల్లో మేము కమిటీలో కొనసాగడనికి ఇష్టపడడం లేదు. మేము నలుగురం సభ్యులం, ఎర్రబెల్లి శరత్, రావుల వెంకటరెడ్డి, బొడ్డు లేనిన్, బొడ్డు అరుణ ఇందిరమ్మ కమిటీ సభ్యత్వం నుండి రాజీనామా సమర్పిస్తున్నాము. ఇది మా అందరికీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం" అని తెలియజేశారు.

Next Story