మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ అరెస్ట్ విడుదల

by Ratna Kumari |

స్టేషన్ ఘనాపూర్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారని తెలియజేశారు.స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియా తో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ అరెస్ట్ విడుదల
X

దిశ, ధర్మసాగర్ : స్టేషన్ ఘనాపూర్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారని తెలియజేశారు.స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియా తో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..శంకర్ గౌడ్ ది ఒక్కడి ఆత్మహత్య కాదని, ఈరోజు రైతుల పరిస్థితి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉందని, ఒకప్పుడు తెలంగాణ గురించి సమ్మె చేసిన మేము ఇప్పుడు మా జీవితాల గురించి సమ్మె చేస్తున్నామని, బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను రాష్ట్రం మొత్తం గమనిస్తుందని తెలియజేశారు. చనిపోయిన వారిని చూడడానికి వెళుతుంటే అక్రమ అరెస్టులా చేయడం సమంజసం కాదని అన్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనితో కాంగ్రెస్ బిజెపి దోస్తీ స్పష్టమవుతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి 50 లక్షలు చెల్లించాలని అన్నారు. మీకు అధికారం ఇచ్చింది గడ్డి పీకడానికి కాదు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలియజేశారు. సమాచారం అందుకొని స్టేషన్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కి బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీనివాస గౌడ్.

Next Story