- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్‌లో భారీ కుంభకోణం:మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు హరీష్ రావు ఆరోపించారు.

దిశ, నర్సంపేట: తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్ కే ఇచ్చినట్లు తెలిపారు. ఒక్క టెండర్ కూడా మైనస్‌కు పోకుండా అన్నీ ఎక్సెస్ కే ఎట్లా పోయాయని ప్రశ్నించారు. ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ. 494 కోట్ల ఒక లక్ష రూపాయల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు. నర్సంపేట ప్యాకేజ్-8 కింద రూ. 136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ. 142 కోట్లకు (4.86% ఎక్సెస్) ఇచ్చారని గుర్తు చేశారు.
టెండర్‌లో ఉన్నది నీ మనుషులా? నా మనుషులా?
ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్‌గా పెట్టుకుని ఈ 500 కోట్ల దోపిడీకి తెర తీశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హ్యామ్ రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25% ఎక్సెస్‌తో జరిగిన రూ. 5వేల కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడినట్లు గుర్తు చేశారు. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీష్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి గుర్తు చేశారు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయలన్నారు. టెండర్‌లో ఉన్నది నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలని డిమాండ్ చేశారు.






