- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్నించు వినాయక..
వినాయక నిమజ్జనం వేళ విగ్రహాలు వంతెన పైనుంచి పడవేత.. డ్యామేజ్ అయిన వంతెన.. ఆగ్రహించిన భక్తులు

మన్నించు వినాయక..
- వినాయక నిమజ్జనం వేళ విగ్రహాలు వంతెన పైనుంచి పడవేత
- డ్యామేజ్ అయిన వంతెన.. ఆగ్రహించిన భక్తులు
దిశ,డోర్నకల్: వినాయక చవితి సమీపించే కొలది భక్త బృందం ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. దాతలను సంప్రదించి విగ్రహాలు కొనుగోలు చేస్తారు. వాడవాడనా విగ్రహాలు ఏర్పాటు చేసి చిన్న పెద్ద కలిసి సంబరాలు జరుపుకుంటారు.. కొందరు దీక్షలు, కంకణాలు కట్టుకుంటారు. మందు, మాంసానికి దూరంగా ఉంటారు. తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుతారు. కోరిన కోరికలు ఫలించాలని మొక్కుబడులు చేసుకుంటారు. గణపతి బొప్పా మోరియా నినాదాలతో నిమజ్జనం జరుపుతారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని మున్నేరు వంతెనపై నిమజ్జనం సందర్భంగా బ్రిడ్జి రక్షణ గోడపై నుంచి విగ్రహాలు నీళ్లలోకి పడేసి ఆనవాళ్లు ఉన్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు జరిపి ఈ విధంగా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటించి వినాయకుని నిండు నీళ్లలో నిమజ్జనం చేయాలి కానీ, మద్యం సేవించి, విగ్రహాల ముందు డీజే డాన్సులు, అల్లరి చిల్లరిగా చేయకూడదని కోరారు. దేవుడిని భక్తితో పూజించి పుణ్యాన్ని పొందుకునేలా నిమజ్జనం జరగాలని అన్నారు. వంతెన పైనుంచి పడేసి పాపాన్ని మూట కట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అట్టి భక్తులను మన్నించమని కోరుకున్నట్లు తెలిపారు. బ్రిడ్జి రక్షణ గోడ ధ్వంసం జరిగిందని వాపోయారు. సంబంధిత అధికారులు పరిశీలించి మరమ్మతులు జరపాలని కోరారు.






