- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, హనంకొండ చౌరస్తా: హన్మకొండ జిల్లా నక్కల గుట్ట వాటర్ ట్యాంక్ సమీపంలో గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆదివారం పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో బ్యాంక్ మూసి ఉంది. దీనితో బ్యా్ంక్‌లో పొగలు రావడాన్ని గమనించిన బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ స్టేషన్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే బ్యా్ంక్‌కు చేరుకుని పరిశీలించగా రూ. 2లక్షల చెక్కులు కాలిపోయినట్లు గుర్తించారని సమాచారం. మంటలు ఎలా చెలరేగాయన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






