5 నెలల చిన్నారి చికిత్స కోసం ఆర్ధిక సహాయం

by velandi.Saikiran |

వాజేడు మండలం పెద్ద గంగారం గ్రామ చెందిన మాజోజి నరేందర్ పాప (5 నెలలు) ఊపిరితిత్తుల సమస్యతో బ్రెయిన్ లో మచ్చలు

5 నెలల చిన్నారి చికిత్స కోసం ఆర్ధిక సహాయం
X

దిశ, కన్నాయిగూడెం : వాజేడు మండలం పెద్ద గంగారం గ్రామ చెందిన మాజోజి నరేందర్ పాప (5 నెలలు) ఊపిరితిత్తుల సమస్యతో బ్రెయిన్ లో మచ్చలు వచ్చాయట‌. ప్రస్తుతం పాప పరిస్థితి చాలా సీరియస్ గా కోమాలో ఉన్నట్లు ఖమ్మంలోని ప్రయివేట్ హాస్పిటల్లోని వైద్యులు తెలిపారు. ఇక నరేందర్ పాప అపరేషన్ కోసం ఖర్చు 5,00, 000రూపాయలు అవుతుందని డాక్టర్స్ చెప్పారు.

ఈ త‌రుణంలోనే.... ముప్పనపల్లి సహాయక నిధి సహాయం కోరగా దాతలు సహాయంతో సేకరించారు. ఇక ఆ నగదును ఖమ్మం హాస్పిటల్ లో ఉన్న పాప తండ్రి నరేందర్ కు 22000రూపాయలు ఇవ్వడం జరిగిందని సహాయక నిధి వ్యవస్థాపకుడు అబ్బు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Next Story