ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్దు : మార్కెట్ చైర్మ‌న్

by Ratna Kumari |

ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్ద‌ని ఎల్క‌తుర్తి వ్య‌వ‌సాయ మార్కెట్ చైర్మ‌న్ సుకినే సంతాజీ పేర్కొన్నారు.

ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్దు : మార్కెట్ చైర్మ‌న్
X

దిశ‌, ఎల్క‌తుర్తి : ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస‌పోవ‌ద్ద‌ని ఎల్క‌తుర్తి వ్య‌వ‌సాయ మార్కెట్ చైర్మ‌న్ సుకినే సంతాజీ పేర్కొన్నారు. బుధవారం ఎల్కతుర్తి విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు 11 గ్రామాల్లో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి కష్టపడిన రైతన్న దళారుల నమ్మి ధాన్యాన్ని అమ్ముకుంటే వారికి ఇష్టమైన ధర పెడతారని, దానివల్ల రైతులు నష్టపోతారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 2390, బి గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2360 ధ‌ర చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన వారం రోజులుగా నేరుగా రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేయబడతాయన్నారు. రైతులు సైతం తాలు లేకుండా నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి, మండల రాజకుమార్, సర్పంచులు బొంకురి రజిత రవీందర్, అంబల రాజకుమార్, మునిగడప లావణ్య శేషగిరి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story