రైతులు ఇబ్బందులు పడకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి

by Ratna Kumari |

జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని నర్షంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు.

రైతులు ఇబ్బందులు పడకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని నర్షంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు , నిల్వలపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొక్కజొన్న అధిక దిగుబడి వచ్చిందని తెలిపారు. సుమారు 72 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేయగా, సుమారు 2.25 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైందని అన్నారు. అందుకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు మరియు నిల్వలపై సమగ్రంగా సమీక్షించి, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల నుంచిమొక్కజొన్నను ఎటువంటి ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని, మద్దతు ధర చెల్లింపులు సమయానికి జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి గోదాముల్లో తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని, నిల్వ సమయంలో నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, అగ్రికల్చర్ జెడి అనురాధ, డిసిఓ నీరజ, డీఎం మార్క్‌ఫెడ్ రంజిత్ రెడ్డి, సంబంధిత మండలాల తహసిల్దార్లు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

Next Story