- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర నష్టం
కేటీఆర్ రాష్ట్రంలో రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించారు. మక్కలు, వరి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దిశ, జనగామ : కేటీఆర్ రాష్ట్రంలో రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించారు. మక్కలు, వరి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జనగామ జిల్లా యశ్వంతపూర్‌లో రైతులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేసినప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు ప్రణాళిక రూపొందించలేదని విమర్శించారు. దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయిన రైతుల పంట కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. వరి కొనుగోళ్లలో కూడా జాప్యం జరుగుతుందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై విభాగంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇది రైతులకు నష్టం కలిగిస్తోందన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడిచినా ఇంకా పంట కొనుగోలు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల పక్షాన తాను ఎప్పుడూ నిలుస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.






