వాణిజ్య పంటలు వేస్తే రైతులకు అధిక లాభాలు

by Ratna Kumari |

నకిలీ, విత్తనాలు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవ‌డంతో పాటు పీడీ యాక్ట్ కేసు న‌మోదు చేస్తామ‌ని ఎస్పీ శ‌బ‌రీష్ హెచ్చ‌రించారు.

వాణిజ్య పంటలు వేస్తే రైతులకు అధిక లాభాలు
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లాలోని సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ, డీలర్స్ షాపు యజమానులతో కలెక్టర్ స్నేహ శబరిష్, ఎరువులు, ఫర్టిలైజర్ వినియోగం, వాడకం, సరఫరా పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు 76, ఆగ్రోస్ రైతు కేంద్రాలు 47, హాక 14, ఓడిఎమ్మఎస్ 10, ప్రైవేటు రిటైల్స్ షాపులు 530, మొత్తం 677 ల ద్వారా జిల్లాలోని రైతులకు ఎరువులను సీడ్స్ ను అందించడం జరుగుతుందని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.


జిల్లాలో 4,53,475 ఎకరాలలో ప్యాడి, కాటన్, మిర్చి, మొక్కజొన్న పంటలు ఉన్నాయని, వానాకాలం 2026 సీజన్ కి సంబంధించి యూరియా, 36026.4, డీఏపీ 6092.4, mop 1282.6, ఎస్ఎస్పీ 851.07, npk 24776.2, రైతులకు అందించడం కోసం జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇతర పంటల వైపు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముందుగా సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఆదర్శంగా తీసుకొని ఇతరులకు దారి చూపాలని కలెక్టర్ తెలిపారు. మిల్లెట్స్, ఆయిల్ పామ్, ఇతర వాణిజ్య పంటలు వేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఆ విధంగా డీలర్లు సైతం వారికి అవగాహన కల్పించాలని అన్నారు, అధిక యూరియా వాడితే నేల సారవంతం పోతుందని తద్వారా రైతులకు నష్టమని, వివరంగా చెప్పాలన్నారు, నానో యూరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగాలని తెలిపారు.

ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో కల్తీ ఎరువులు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు ఎరువులు మాత్రమే విక్రయించాలని సూచించారు. నకిలీ ఎరువులు విత్తనాల నివారణ నిమిత్తం జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఇన్ స్పెక్ట‌ర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కమిటీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తార‌ని తెలిపారు. ఏదైనా నకిలీ విత్తనాల ఎరువుల సమాచారం ఉంటే నేరుగా ఇన్ స్పెక్ట‌ర్ హతిరామ్ 8712656920 నెంబర్లు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుదామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారికి అగ్రికల్చర్ ఏవోలు జావేద్, ఛాయా రాజ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎరువులు, విత్తనాల వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. స‌మావేశంలో అద‌న‌పు క‌లెక్ట‌ర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, డీసీఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల సంబంధిత అధికారులు, సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్స్ ఫర్టిలైజర్ షాపులు యజమానులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story