- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు తప్పని యూరియా కష్టాలు..
పాస్ బుక్ జీరాక్స్ లు ఇచ్చి వారం రోజులైనా యూరియా అందకపోవడంతో అసహనం

రైతులకు తప్పని యూరియా కష్టాలు..
- తొర్రూరులో వివాదం...
- పాస్ బుక్ జీరాక్స్ లు ఇచ్చి వారం రోజులైనా యూరియా అందకపోవడంతో అసహనం
దిశ, తొర్రూర్ : తొర్రూరు మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ లు సమర్పించి వారం రోజుల తర్వాత కూడా యూరియా అందకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగింది. అధికారులు పైస్థాయి నుండి యూరియా రాక ఆలస్యమైందని చెప్పి తప్పించుకోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 26, 27, 28 తేదీల్లో జిరాక్స్ లు ఇచ్చిన రైతులకు సోమవారం యూరియా పంపిణీ సమయంలో వివాదం చెలరేగింది. తొర్రూరు మండలంలోని మూడు క్లస్టర్లలో హరిపిరాల, తొర్రూరు, సోమారం ప్రాంతాల్లో యూరియా పంపిణీ జరుగుతుండగా, సోమారం క్లస్టర్‌లో యూరియా అయిపోవడంతో అక్కడి రైతులు ఇతర క్లస్టర్ల వద్దకు చేరుకున్నారు. ఒక క్లస్టర్‌కు చెందిన రైతులు మరొక క్లస్టర్‌కి యూరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. "మాకు సరిపడా యూరియా అందడం లేదు, మాకు న్యాయం చేయాలి" అంటూ రైతులు అధికారులను నిలదీశారు. ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, సోమారం క్లస్టర్ రైతులను ఒక లైన్‌లో, తొర్రూరు క్లస్టర్ రైతులను మరో లైన్‌లో నిలబెట్టి అందరికీ సమానంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు.ఈ తారుమారు సమయంలో ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్‌లు నేలకూలగా, వాటిపై కొందరు కాళ్లతో తొక్కడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రైతుల పత్రాలకే గౌరవం ఇవ్వకపోతే, మా స్థితి ఎలా ఉంటుందో?" అంటూ ప్రభుత్వంపై, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు..






