ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

by Ratna Kumari |

కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం పూసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయలేదంటూ పొన్నం తిరుమలేష్ అనే రైతు మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని ఏన బావి గ్రామంలో చోటు చేసుకుంది.

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, లింగాలఘణపురం : కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం పూసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయలేదంటూ పొన్నం తిరుమలేష్ అనే రైతు మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మండలంలోని ఏన బావి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుమలేష్ నెల రోజుల క్రితం వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోయ‌గా.. ఇంతవరకు కూడా కొనుగోలు జరగలేదని తెలిపారు. అతని తర్వాత వచ్చిన రైతుల వడ్లను కొనుగోలు చేసి మిల్లుకు తరలిస్తున్నారని తెలిపారు. టోకన్స్ ఇచ్చి కూడా కొనుగోలు దారులు ఇష్టానుసారంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలేష్ కు తూకం పెట్టడానికి బస్తాలు ఇచ్చి కూడా వేరే వారికి తూకం పెట్టడంతో మనస్థాపానికి గురై ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడేటట్టు తెలిపారు.

తోటి రైతులం అడ్డుకున్నాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడని, సీసీలు, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఏన భాయి, మాణిక్యపురం గ్రామాలకు కలిపి ఒకే సెంటర్ ఏర్పాటు చేశారని, దానికి తోడు పక్క గ్రామమైన సిరిపురం కొనుగోలు కేంద్రం ఉన్న, ఆ రైతుల ధాన్యం కూడా ఇక్కడే కొనుగోలు చేయడంతో ఆలస్యం అవుతుందన్నారు. నిర్వాహకులు కమిషన్ వస్తుందని ఆశతో పక్క గ్రామాల వడ్లు కూడా కొనుగోలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులను అష్ట కష్టాలకు గురి చేస్తుందని, కాలం నెత్తిమీదికి వస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించడం వల్ల రేపు, అకాల వర్షాలు కురిస్తే మా పరిస్థితి ఏంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story