విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

by Elthuri vijay kumar |

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తల్లారి వీరయ్య (55) గురువారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..
X

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

తొర్రూరు మండలం హరిపిరాలలో విషాదం

దిశ తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తల్లారి వీరయ్య (55) గురువారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు.స్థానికుల సమాచారం మేరకు, వీరయ్య తన పశువుల కోసం వ్యవసాయ బావి వద్ద గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story