- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అకాల వర్షం... చెట్టు కూలి రైతు మృతి
by S Gopi |
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గత అర్ధరాత్రి కురిసిన... Farmer died due to rain

X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గత అర్ధరాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు పంటలు దెబ్బతిన్నాయి. రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల రాళ్ల వర్షం రావడంతో మండలంలోని చాలా గ్రామాలలో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. మండలంలోని చిన్న ఎల్లాపూర్ గ్రామనికి చెందిన ధరంసోత్ శంకర్ మరియు జరుపల కిర్యా అనే ఇద్దరు రైతులు శనివారం రాత్రి మొక్కజొన్న చేను కావలికి వెళ్లారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు సమీపంలోని ఓ గుడి వద్ద గుడిసెలో తల దాచుకుని ఉండగా ఈదురు గాలులకు ఒకేసారి చెట్టు కూలి వారిపై పడటంతో శంకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కీర్య అనే రైతుకు రెండు కాళ్లు విరిగాయి. ఇది గమనించిన తండావాసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని చెట్టును తొలగించి కీర్యను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story






