ఆటోను ఢీ కొన్న గుర్తు తెలియ‌ని వాహ‌నం.. వ్య‌క్తి మృతి..

by Bhanu |

దైవ ద‌ర్శ‌నం కొసం వేముల‌వాడ‌కు అటోలో వెలుతున్న ఒక కుటుంబాన్ని గుర్తు తెలియ‌ని వాహ‌నం అతి వేగంతో ఢీ కొట్టడంతొ అటోలో ప్రయాణిస్తున్న వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న తాడ్వాయి మండ‌ల కేంద్రానికి స‌మీపంలో గ‌ల జాతీయ ర‌హ‌దారి పై చోటుచేసుకుంది.

ఆటోను ఢీ కొన్న గుర్తు తెలియ‌ని వాహ‌నం.. వ్య‌క్తి మృతి..
X

దిశ‌, ఏటూరునాగారం: దైవ ద‌ర్శ‌నం కొసం వేముల‌వాడ‌కు అటోలో వెలుతున్న ఒక కుటుంబాన్ని గుర్తు తెలియ‌ని వాహ‌నం అతి వేగంతో ఢీ కొట్టడంతొ అటోలో ప్రయాణిస్తున్న వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న తాడ్వాయి మండ‌ల కేంద్రానికి స‌మీపంలో గ‌ల జాతీయ ర‌హ‌దారి పై చోటుచేసుకుంది. కుటుంబ స‌భ్యుల పిర్యాదు మేర‌కు.. భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా, మండ‌లం పిన‌పాక‌, గ్రామం గోపాల్‌రావు పేట గ్రామంకు చెందిన గొరంట్ల శ్రీ‌ను(48) అనే వ్య‌క్తి కుటుంబ సభ్యుల‌తో క‌లిసి దైవ ద‌ర్శ‌నం కోసం వేముల‌వాడ‌కు ఉద‌యం స‌మ‌యంలో బ‌య‌లు దేరాడు. ఈ క్ర‌మంలోనే తాడ్వాయి 2 స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై ఏదురుగా వస్తున్న గుర్తు తెలియ‌ని వాహ‌నం అటోను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో గోరంట్ల శ్రీ‌ను తీవ్ర గాయాల‌తో అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా కుటంబ సభ్యుల్లో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. కాగా కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తాడ్వాయి ఏస్ఐ శ్రీ‌కాంత్ రెడ్డి తెలిపారు.


Next Story