- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల బహిష్కరణ డబ్బు వసూళ్లు.. ఐదుగురికి రిమాండ్
by Batti.Sumithra |
గోపనపల్లి గ్రామానికి చెందిన అల్లాడి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీసులు కొందరిపై కేసు నమోదు చేశారు.

X
దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన అల్లాడి రమేష్ (37), తండ్రి నరసయ్య, ముదిరాజ్ కులానికి చెందిన రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం కొలిపాక మధు (34), సూర అశోక్ (45), సూర రమేష్ (40), భూస నరేష్ (30), సురరాజు (39) అనేవారు రమేష్‌ను కుల బహిష్కరణకు గురిచేసి, అతని వద్ద రూ.50 వేలను డిపాజిట్‌గా తీసుకున్నారన్నారు. అనంతరం ఆ డబ్బులను ఖర్చు చేసి, అతనిని దుర్భాషలతో దూషిస్తూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన పై కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, నిందితులైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్ తెలిపారు.
Next Story






