మరిపెడ మండలంలో ఎక్సైజ్ దాడులు

by Elthuri vijay kumar |

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శనివారం తొర్రూరు డివిజన్ ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

మరిపెడ మండలంలో ఎక్సైజ్ దాడులు
X

మరిపెడ మండలంలో ఎక్సైజ్ దాడులు

- 23 లీటర్ల సారాయి స్వాధీనం.. ఆరుగురుపై కేసు నమోదు

దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శనివారం తొర్రూరు డివిజన్ ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జరుపుల తండా, మాలోతు తండ, గుండెపూడి గ్రామాల్లో ఏకకాలంలో నాలుగు టీములు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 23లీటర్ల సారాయి స్వాధీనం చేసుకొని, సుమారు 800 లీటర్ల బెల్లం పానకం బెల్లం ధ్వంసం చేశారు. సారాయికి సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో తొర్రూర్ ఎక్సైజ్ ఎస్సై శంకర్, స్టేట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ ఎస్సై సాయి కృష్ణ, మహబూబాద్ డిటిఎఫ్ కిరీటి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story