- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొర్రూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎక్సైజ్ పోలీసులు భారీగా అక్రమ నల్లబెల్లం, గుడుంబాను పట్టుకున్నారు.

తొర్రూరులో ఎక్సైజ్ పోలీసుల దాడి
-అక్రమ నల్ల బెల్లం, పట్టిక, గుడుంబా స్వాధీనం
- ముగ్గురి అరెస్ట్
దిశ తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎక్సైజ్ పోలీసులు భారీగా అక్రమ నల్లబెల్లం, గుడుంబాను పట్టుకున్నారు. దసరా ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మంగళవారం అర్థరాత్రి హరిపిరాల గ్రామ శివారులో ఎక్సైజ్ పోలీసులు, వరంగల్ ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు సంయుక్తంగా రూట్‌వాచ్, వాహనాల తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎం వ్యాను, కారును ఆపడానికి అధికారులు ప్రయత్నించగా, వాహనదారులు పారిపోవడానికి యత్నించారు. వెంటనే అధికారులు వెంటాడి వాహనాలను ఆపి తనిఖీ చేయగా, 40 బస్తాల నల్ల బెల్లం (సుమారు 2వేల కిలోలు),75 కిలోల పట్టిక, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న కొత్తపెళ్లి సైదయ్య, గుగులోత్ సురేష్, ఇస్లావత్ విజయ్ ను అదుపులోకి తీసుకొని, వాహనాలతో పాటు కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ బుస అశోక్ తెలిపారు. ఆపరేషన్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ వరంగల్ ఇన్ స్పెక్టర్ కె. నాగయ్య, నాగేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ బుస అశోక్, ఎస్‌ఐలు జి. చంద్రశేఖర్, రవళి రెడ్డి శంకర్‌తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.






