- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ట్రేడ్ లైసెన్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి : మున్సిపల్ కమిషనర్ రమేష్
ట్రేడ్ లైసెన్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి : మున్సిపల్ కమిషనర్ రమేష్
by Ratna Kumari |
ములుగు మున్సిపాలిటీలో పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులందరూ విధిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీలో పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులందరూ విధిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలని ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారస్తులకు లైసెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ను వెంటనే పొందాలని, లైసెన్సులు పొందిన వారే వ్యాపారాలు చేసుకునే వీలు కల్పిస్తామని వివరించారు. నిర్దేశిత గడువులోగా ట్రేడ్ లైసెన్స్ పొందని, పునరుద్ధరించని వారి పై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Next Story






