అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:మంత్రి సీతక్క

by Jakkula.Mamatha |

ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు.

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్, 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లకు, 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న తెలంగాణ గెజిటెడ్ భవనానికి, 10 లక్షల రూపాయలతో నిర్వహించనున్న నాన్ గెజిటెడ్ భవనానికి, గట్టమ్మ వద్ద మూడు కోట్ల 62 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 33/11 తేదీ విద్యుత్ ఉప కేంద్రానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. 61 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బండారిపల్లి జంక్షన్, ఇందరీకరణ పనులకు, ఐ లవ్ యు ములుగు సింబల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా

కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మీ ఆడబిడ్డగా ఆదరించాలని కోరారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయలేక పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ, నేడు మంత్రిగా ప్రజా ప్రభుత్వం లో కొనసాగుతూ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి వివిధ పనులను చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, మరో 50 కోట్ల రూపాయలను మంజూరు చేయించి మిగిలిన రోడ్డు పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాల వారు వారి వారి దేవతలు నెలకొన్న ఆలయాలకు ప్రత్యేక నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికే ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద రామప్ప శిల్పాలతో కూడిన సింబల్ ను ఏర్పాటు చేయడంతో పాటు శివుని లింగం ఏర్పాటు చేయడం జరిగిందని ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, అదే తరహాలో ములుగులో ఐ లవ్ యు ములుగు పేరుతో సింబల్ చూడముచ్చటగా ఉందని కొనియాడారు. ఇలాంటి సింబల్ లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ములుగు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో ఒక హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story