- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్రెగుట్టల ఎన్ కౌంటర్ లో ఏటూరు గ్రామవాసి మృతి
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనకు కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టల అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన యువకుడు సాధనపల్లి చందు అలియాస్ రవి (వయసు 24) మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

దిశ, కన్నాయిగూడెం : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనకు కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టల అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన యువకుడు సాధనపల్లి చందు అలియాస్ రవి (వయసు 24) మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. చందు తల్లి అన్నపూర్ణ (55), తండ్రి లేటు వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు – పెద్దవాడు రాజు, చిన్నవాడు చందు. ఇంటర్మీడియట్ వరకు చదివిన చందు భద్రాచలం ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న సమయంలో మావోయిస్టు భావజాలం ప్రభావితుడై రెండు సంవత్సరాల క్రితం అటవీ ఉద్యమంలో చేరాడు.
కర్రెగుట్టల ప్రాంతంలో గత వారం రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో చందు మృతి చెందినట్టు సమాచారం. అతడు మావోయిస్టు పార్టీలో బటాలియన్ డాక్టర్ టీం కమాండర్‌గా, టాప్ లీడర్ దామోదర్‌కు అత్యంత సమీపంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చందుపై ఎనిమిది లక్షల రివార్డు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. చందు మృతి వార్త గ్రామాన్ని విషాదంలో ముంచింది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆర్తనాదాలు చేస్తూ దుఃఖంలో మునిగిపోయారు. చందు భౌతికకాయాన్ని స్వగ్రామం ఏటూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.






