- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చతికల పడ్డదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్

దిశ, వర్థన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చతికల పడ్డదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలోని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ లో ఉంటూ పార్టీకి నమ్మక ద్రోహం చేస్తున్నంటువంటి ద్రోహులపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్.! అధికార మదంతో అధికారులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా! తట్టుకొని నిలబడి విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ల పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు. గత ఎమ్మెల్యే ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గంలో మండలంలో 60% శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, సర్పంచ్ ఎన్నికలలో 30% శాతానికి పడిపోవడానికి దేనికి నిదర్శనమని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో ముందంజలో ఉండటం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు.






